పంట పొలాలపై మంచు దుప్పటి కప్పేసింది. అప్పుడే మంచు తెరలను చీల్చుకుంటూ సూర్యుడు బయటకు వస్తున్నాడు. కనువిందు చేస్తున్న ఈ దృశ్యం పలువుర్ని ఎంతగానో ఆకర్షిస్తోంది. శుక్రవారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గోపాలపురంలో వాహనం పై వెళ్తున్న ఓ వ్యక్తి దీనిని తన సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఎంతో సుందరమైన సూర్యోదయం పలువురిని ఆకట్టుకుంది.