భూపాలపల్లి, నాగారం గ్రామానికి చెందిన రామినేని దేవేందర్ భార్యతో విడిపోయి, మద్యానికి బానిసై, జీవితం మీద విరక్తి చెంది, మనస్థాపానికి గురై ఇంట్లో ఉన్న కలుపు మందును త్రాగగా చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజిఎంకు తరలించారు. ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడని మృతుడి తల్లి రామనేని నర్సమ్మ గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని విచారణ చేపట్టామని భూపాలపల్లి సీఐ నరేష్ తెలిపారు.