చేర్యాల: గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులు అరెస్ట్

60చూసినవారు
చేర్యాల: గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులు అరెస్ట్
చేర్యాల పట్టణ కేంద్రంలో గంజాయిని విక్రయిస్తున్న నలుగురు యువకులను చేర్యాల పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సిఐ ఎల్. శ్రీను, ఎస్సై నిరేష్ తెలిపారు. వారు మాట్లాడుతూ చేర్యాల మండల కేంద్రానికి చెందిన రాసురి నవీన్, చుంచనకోట గ్రామానికి చెందిన యువకులు ఏశబోయిన కరుణాకర్, పొన్నబోయిన పవన్, చిట్కూరి శ్రవణ్ లు చెడు వ్యసనాలకు అలవాటుపడ్డారన్నారు. వారి దగ్గర నుండి 50గ్రాముల గంజాయి లభించిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్