గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్టు చేర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను మంగళవారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన దూడెం శ్రీధర్ యాదవనగర్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నాడనే సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. 490 గ్రాముల గంజాయి, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని విచారించామని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి మిత్రుని సాయంతో గంజాయిని తెచ్చి చేర్యాల ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు.