ఫైర్ మినిస్ట్రీ చర్చి కడవెండి గ్రామంలో ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా గ్రామంలోని చర్చిలో భక్తులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేసారు. పాస్టర్ ప్రాసన్న పాల్ మరియు సునప్ జీ. క్రిస్టమస్ కేకును కట్ చేసిన అనంతరం ఏసుక్రీస్తు జననం శాంతి మార్గం నిను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని క్రిస్తు వాక్య బోధనలు చేసారు.ఈ వేడుకలలో సంఘస్తులు విజయ్ కుమార్, రాములు, పవన్ కుమార్ పాల్గొన్నారు.