కట్కూర్ లో సినాయ్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ క్రిస్మస్ పండుగ సందర్బంగా ముఖ్య అతిధులుగా విచ్చేసిన సంఘ ప్రధాన కాపరులు రెవరెండ్ పిన్నింటి స్వామిదాసు అయ్యగారు రెవరెండ్ పిన్నింటి ఎస్తేర్ రాణి అమ్మగారు వాక్యసందేశం అందించి ప్రపంచ శాంతి కొరకు ప్రార్థనలు చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రిస్మస్ పండుగలో పాస్టర్ రెవరెండ్ పిన్నింటి స్టాన్లీ అందరికీ బహుమతులు అందజేశారు.