గుండెపోటుతో కాంగ్రెస్ నాయకులు నరేష్ రెడ్డి మృతి

77చూసినవారు
గుండెపోటుతో కాంగ్రెస్ నాయకులు నరేష్ రెడ్డి మృతి
ఉమ్మడి వరంగల్ మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నూకల నరేష్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల వివరాల మేరకు గత నాలుగు రోజుల క్రితం గుండెపోటు రావడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారని తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్