చిల్పూర్ మండల సమగ్ర అభివృద్ధికి సీపీఎం ప్రజా పోరాటాలు

85చూసినవారు
మండల సమగ్ర అభివృద్ధికి సీపీఎం పార్టీ నిరంతర ప్రజా పోరాటాలు నిర్వహిస్తోందని జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మంగళవారం అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) జనగాం జిల్లా చిల్పూర్ మండల మూడో మహాసభ మండల కేంద్రంలోని ఏచూరి నగర్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి కనకా రెడ్డి హాజరయ్యారు. ఈ మహాసభలో రాపర్తి రాజు, అహల్య, యాకయ్య, మండల కార్యదర్శి రమేష్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్