సర్వే డేటా ఎంట్రీ కీలకమైనదని, వలస వెళ్ళిన వారి వివరాలు ఫోన్ కాల్ ద్వారా సేకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై జార్ఖండ్ రాజధాని రాంచి నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉప ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఈ సమీక్షలో జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.