జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి 400 సీట్లు కైవసం చేసుకొని రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తామని ముందుగానే చెప్పింది, బిజెపికి ఇప్పుడున్న రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేదని అన్నారు.