జనగామ జిల్లా లో మంత్రాల నెపంతో తమ కుమారుడిని పాఠశాల నుండి పంపించారంటూ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని సోమవారం జనగామ కలెక్టరేట్ ఎదుట సదరు విద్యార్థి తల్లిదండ్రులు ఫ్లెక్సీ తో నిరసన తెలిపారు.
కలెక్టర్ కార్యాలయం ముందు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ఫ్లెక్సీతో తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన పై స్పందించి ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.