జనగామ : సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలి

67చూసినవారు
జనగామ : సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఆన్లైన్ నమోదు ప్రక్రియను డాటా ఎంట్రీ ఆపరేటర్ లు వేగవంతం చేయాలని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఆన్లైన్ డేటా నమోదును ఆయన పరిశీలించి వెబ్సైట్ పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ డేటా నమోదు ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్