బచ్చన్నపేట మండలంలోని కట్కూర్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలోకి చేరుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పూర్వం ఈ పాఠశాలలో 400 పైగా విద్యార్థులు ఉండేవాళ్ళని, కానీ నేడు ఆ సంఖ్య 40 కి చేరిందని అన్నారు. పాఠశాల మొత్తం చెత్త చెదరంతో నిండిందని, ఇప్పటికైనా అధికారులు విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక పాఠశాల భవనానికి మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని గురువారం కోరుతున్నారు.