కొమురవెల్లి మండలం శభాష్ గూడెం గ్రామంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రోడ్డు నిరసన సెగ తారస్థాయికి చేరుకుంది. ప్రయాణికుల అసౌకర్యాలను అదేవిధంగా గ్రామ ప్రజల ప్రయాణంలో జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. ఇందులో మండల కమిటీ సభ్యులు నాగపూర్ కనకయ్య మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.