పాలకుర్తి : మద్యం తాగి వాహనాలు నడపకూడదు

66చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని విస్నూర్ గ్రామ మూలమలుపు వద్ద పాలకుర్తి ఎస్సై దూలం పవన్ కుమార్ డ్రంక్ అండ్ డ్రైవ్ ను శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపకూడదని వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనాలకు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని వివరించారు.

సంబంధిత పోస్ట్