చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ ఆదివారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భముగా ఇప్పుడున్న రెవిన్యూ డివిజన్ లోని మండలాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను మరియు చేర్యాల ప్రాంత ప్రజల ఆకాంక్ష అయిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరగా, అధికారులతో మాట్లాడుతానని ఆయన హామీ ఇచ్చారన్నారు.