మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో ఉన్న పాకాల వాగు వద్ద శుక్రవారం అర్థరాత్రి మొసలి కలకలం రేపింది. నీరు లేకపోవడంతో మొసలి సంచారం. ఎటు వెళ్లాలో తెలియక రోడ్లపైకి వస్తున్న మొసలిని గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురై రోడ్లపైనే కొన్ని నిమిషాల సేపు ఆగవలసిన పరిస్థితి నెలకొంది.