భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఎండ తీవ్రతతో శనివారం మహబూబాబాద్ జిల్లా ప్రజలు తల్లడిల్లుతున్నారు. అత్యవసర పనులు ఉంటే మినహా బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో చిన్నారులతోపాటు పెద్దలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కనీస చర్యలు తీసుకుంటే రక్షణ పొందవచ్చు. ఆహారం, ఆరోగ్యం, అలవాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.