తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శిలు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జగదీశ్వర్ యాదవ్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా గాడిపళ్లి సతీష్, ప్రధాన కార్యదర్శిగా తోట సురేష్, ఉపాధ్యక్షునిగా మట్టా సైదులు, సహాయ కార్యదర్శిగా దేవరకొండ చంద్రబాను, కోశాధికారిగా జలగం నరేందర్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.