తెలంగాణ జన సమితి అనుబంధ యువజన సమితి & విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో మలిదశ తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్థంతి సందర్భంగా డిసెంబర్ 3 న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో "తెలంగాణ యూత్ డే" సదస్సును నిర్వహిస్తున్నట్టు విద్యార్థి జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇరుగు మనోజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా అమరుడు శ్రీకాంతాచారి వర్థంతిని "తెలంగాణ యూత్ డే" గా నిర్వహిస్తున్నామన్నారు.