మహబూబాబాద్ జిల్లాకు చెందిన స్కూల్ అసిస్టెంట్( బయాలజీ ) పోస్టు గల్లంతు అయింది. 38 పాఠశాలలు, వాటిలో 43 ఖాళీలు చూపిస్తూ వచ్చారు. కానీ వెబ్ ఆప్షన్స్ లో 37 పాఠశాలలు, 42 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురాగా.. వెబ్ ఆప్షన్స్ ఎడిటింగ్ సమయంలో చేరుస్తాము అని అన్నారు. తీరా చూస్తే ఒక్క పోస్టు మిస్ అయింది. ఆ ఒక్క పోస్టును కూడా భర్తీ చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.