కొత్తగూడ: ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
మహబుబాబాద్: కొత్తగూడ మండలం కేంద్రానికి చెందిన స్వప్న శ్రీకాంత్ దంపతులకు 11 నెలల పాప ఉంది. ఆ పాప గుండెకు రంధ్రం ఏర్పడిందని తక్షణమే శస్త్రచికిత్స చేయకపోతే ప్రాణానికే ముప్పు అని వైద్యులు చెప్పారు. కూలి పనిచేస్తేనే పూట గడిచేదని, అలాంటిది రెండున్నర లక్షల ఖర్చు అవుతాయని చిన్నారి శస్త్రచికిత్సకు అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలని గురువారం విలపిస్తున్నారు. దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు. ఫోన్ పే: 9949993216