మేడారంలో కోతుల సమస్య పరిష్కరించాలని వినతి

53చూసినవారు
మేడారంలో కోతుల సమస్య పరిష్కరించాలని వినతి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో విస్తరిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు శనివారం పంచాయతీ కార్యదర్శి కొర్నేబెల్లి సతీష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరచూ కోతుల దాడులతో భయాందోళనలకు గురవుతున్నామని తెలిపారు. తోటలు, పంటలను నాశనం చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చేయడం బాబురావు, పీరిల వెంకన్న, రానా రమేష్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్