ములుగు జిల్లా వెంకటాపురం నుండి వాజేడు వైపు వస్తున్న ఇసుక లారీ వెంకటాపురం వైపు వెళ్తున్న కారును ఆదివారం రాత్రి ఢీకొట్టింది. అయితే ఇసుక లారీ టైర్ పేలడంతో అదుపుతప్పి కారును ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులోని పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా ప్రస్తుతం డ్రైవర్ పరారిలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు.