ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్ష్మీపురం ఆశ్రమ పాఠశాలలో వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆదివారం ఎస్సై కమలాకర్ తెలిపారు. గోవిందరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సై పర్యటించి వరద ఉదృతిని పరిశీలించారు. ప్రజలు అందరూ తుఫాను తగ్గేంత వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.