ఏటూరునాగారం: ఇసుక క్వారీ పనులను అడ్డుకున్న గ్రామస్తులు

57చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయిలో జరుగుతున్న ఇసుక క్వారీ పనులను గ్రామస్తులు మంగళవారం రాత్రి అడ్డుకున్నారు. రాత్రి వేళ అక్రమంగా జంపన్నవాగు నుండి ఇసుకను డంపింగ్ చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా ఇష్టానుసారంగా పనులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. కాగా గతంలో నిర్వహించిన ఇసుక క్వారీ కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామన్నారు.

సంబంధిత పోస్ట్