ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో గురువారం విద్యుత్ శాఖ అధ్వర్యంలో రైతు పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటాపురం ఏడిఈ ఆకిటి స్వామిరెడ్డి పాల్గొని వ్యవసాయ విద్యుత్ మోటర్లు, విద్యుత్ సరఫరా, కెపాసిటర్ వాడకం, తదితర జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు. ప్రతి రైతు తమ వ్యవసాయ విద్యుత్ మోటర్ కు తప్పనిసరిగా కెపాసిటర్ ను అమర్చుకోవాలని సూచించారు.