వాజేడులో భారీ వర్షం.. తాటి చెట్టుపై పిడుగు

64చూసినవారు
వాజేడులో భారీ వర్షం.. తాటి చెట్టుపై పిడుగు
ములుగు జిల్లా వాజేడు మండలంలో సోమవారం మధ్యాహ్నం నుండి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో వాజేడు మండలంలోని అయ్యవారిపేట గ్రామంలోని ఓ తాటిచెట్టు పై ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో చెట్టుపై మంటలు చెలరేగాయి. ప్రమాద సమయం లో చెట్టు దగ్గరలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వర్షం పడుతున్న సమయంలో రైతులు, స్థానికులు చెట్ల కింద ఉండకూడదని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్