ములుగు జిల్లాలో పర్యాటక ప్రాంతమైన లక్నవరంలో మూడో కాటేజ్ సిద్ధమైంది. లక్నవరంలో 8 ఎకరాల విస్తీర్ణంలో కాటేజీలను TSTDC, ఫ్రీ కోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఈ ఐలాండ్ లో 22 కాటేజ్ లు ఉన్నాయి. అందులో నాలుగింటిని కుటుంబసభ్యులతో బస చేసేందుకు వీలుగా తీర్చిదిద్దారు. ఫ్రీ కోట్స్ కు చెందిన సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తారని త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి తేనున్నట్లు సోమవారం అధికారులు తెలిపారు.