ములుగు జిల్లాలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ శుక్రవారం పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నష్టాన్ని పరిశీలించేందుకు ఆయన పర్యటించనున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రానికి చేరుకొని, అక్కడి నుండి పస్రా - తాడ్వాయి మధ్య కొట్టుకుపోయిన జాతీయ రహదారి, మేడారం అడవుల్లో గాలి వాన బీభత్సానికి కూలిన చెట్లను పరిశీలించనున్నారు.