ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం సిపిఎం వామపక్షాలు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యానర్, నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు. దేశ ప్రజానీకానికి కేంద్రమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని, కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.