ములుగు: ప్రభుత్వ స్థలంలో వేసిన గుడిసెలు తొలగించిన అధికారులు

66చూసినవారు
ములుగు జిల్లాలో అక్రమ గుడిసెలను శనివారం రెవెన్యూ అధికారులు తొలగించారు. ఇంచెర్ల సమీపంలోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వేసుకున్న 80 గుడిసెలు తొలగించారు. పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాల సహాయంతో అక్రమ గుడిసెలను తొలగించారు. 25 ఎకరాల ప్రభుత్వ స్థలంలో గత ఐదు సంవత్సరాల నుంచి అక్రమంగా గుడిసెలు వేసి నివాసం ఉంటున్న ఇతర ప్రాంతాలకు చెందిన కుటుంబాలను పంపించారు. గుడిసెలు తొలగించిన స్థలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించనుంది.

సంబంధిత పోస్ట్