డిసెంబర్ 1న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల మంది మాలలతో సింహ గర్జన సభను ఏర్పాటు చేయునున్నట్లు ములుగు జిల్లా ఐక్యవేదిక జిల్లా కన్వీనర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపల శివకుమార్ అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొమురంభీం జంక్షన్ వద్ద ఏటూరునాగారం మండలం అధ్యక్షుడు దాసరి తిరుపతి ఆధ్వర్యంలో బుధవారం మాలల సమావేశం నిర్వహించి, మాలల సింహగర్జన బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరించారు.