ములుగు జిల్లాలో శనివారం మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. ఆదివాసీ ఐక్యవేదిక, యువజన సంఘాల పేరుతో రోడ్లపై, గోడలపై పోస్టర్లు ప్రత్యక్షం కావడంతో చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులకు ఆదివాసుల ప్రాణాలు అంటే లెక్క లేదా.? అంటూ పోస్టర్లలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదివాసీల కోసమే మా పోరాటం అంటూ, నీతులు చెప్పే మావోయిస్టులు అమాయక ఆదివాసీ గిరిజన ప్రజలను చంపుతున్నారని పోస్టర్లలో పేర్కొన్నారు.