క్రీడల్లో గెలుపోటములు సహజమని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దనసరి సూర్య అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను ఆదివారం సూర్య ప్రారంభించి మాట్లాడారు. సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న క్రీడలను స్నేహపూర్వకంగా నిర్వహించుకోవాలని అన్నారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటేష్, అప్సర్ పాషా తదితరులు పాల్గొన్నారు.