చెట్ల కొమ్మల సాయంతో వాగు దాటిన ముస్మి రైతులు

52చూసినవారు
చెట్ల కొమ్మల సాయంతో వాగు దాటిన ముస్మి రైతులు
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలం ముస్మిలో రైతులు అడవి పందుల బారి నుంచి పంటలను రక్షించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పంట పొలాలకు కాపలాగా వెళ్లి వరదల్లో చిక్కుకున్న రైతులు. ముస్మి వాగు ఉద్ధృతికి బిక్కుబిక్కుమంటూ రాత్రంతా అక్కడే గడిపారు. రైతులు చెట్ట కొమ్మల సాయంతో ప్రమాదకరంగా వాగు దాటి ఒడ్డుకు చేరారు. ముస్మి వాగుపై వంతెన నిర్మించి ప్రాణాలు కాపాడాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్