బిఆర్ఎస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మరోసారి బుద్ధి చెప్తారని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ములుగులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను ఓర్వలేకనే కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని విమర్శించారు. తమ ఉనికిని కాపాడుకునేందుకే బిఆర్ఎస్ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.