నేతకాని కులస్తులను ఎస్సీ-ఏ జాబితాలో చేర్చాలని నిరసన

59చూసినవారు
నేతకాని కులస్తులను ఎస్సీ-ఏ జాబితాలో చేర్చాలని నిరసన
నేతకాని కులస్తులను ఎస్సీ-ఏ జాబితాలో చేర్చాలని నేతకాని కుల హక్కుల పోరాట సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలోని రోడ్డుపై మంగళవారం బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ సంఘం నాయకులు చిన్నికృష్ణ, చంద్రబాబు, బోజా రావు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షలకుపైగా నేతకాని కులస్తులు ఉన్నారని అన్నారు. ప్రభుత్వం కులగణన చేసి నేతకాని కులస్తులను ఎస్సీ-ఏ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్