కొత్తగూడలో మెగా వైద్యశిబిరం ఏర్పాటు

85చూసినవారు
కొత్తగూడలో మెగా వైద్యశిబిరం ఏర్పాటు
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండల కేంద్రంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలమేరకు శుక్రవారం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య నిపుణులతో నిర్వహించిన ఈ వైద్యశిబిరంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు వైద్యపరీక్షలు చేయించుకున్నారు. పలువురికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వైద్యులు రమేష్, నవీన్ రెడ్డి, శ్రవణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్