ములుగు జిల్లా లో అక్రమంగా దాచి ఉంచిన కలపని సోమవారం ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. వెంకటాపురం మండలం కలిపాక అటవీ ప్రాంతంలో రవాణాకు సిద్ధంగా దాచి ఉంచిన కలపను సీజ్ చేసి స్వాధీనం చేసుకున్న ఏడు కలప దుంగలను అటవీ శాఖ కార్యాలయం కు తరలించారు. సీజ్ చేసిన కలప విలువ సుమారు లక్ష యాభై వేల రూపాయల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.