మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కమలాపూర్ బిల్ట్ ఇంటెక్ వెల్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు సమీపంలో గోదావరి ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం మంగపేట మండలంలోని లోతట్టు ప్రాంతాలైన పొదుమూరు, వడ్డెరకాలనీ, బోరునర్సాపూర్, చుంచుపల్లి, వాడగూడెం, రాజపేట, ముసలమ్మవాగు, అకినేపల్లి మల్లారం, బ్రాహ్మణపల్లి, కత్తిగూడెం ప్రజలను రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తం చేశారు.