రోడ్డుకు అడ్డంగా పడిన వృక్షం.. తొలగించిన పోలీసులు

56చూసినవారు
రోడ్డుకు అడ్డంగా పడిన వృక్షం.. తొలగించిన పోలీసులు
ములుగు జిల్లా తాడ్వాయి మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి తాడ్వాయి - కాటాపూర్ రహదారిపై శనివారం తెల్లవారుజామున నాంపల్లి గ్రామం వద్ద ఓ భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడింది. శనివారం ఉదయం నుండి ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది సాంబయ్య, రమేశ్ ఘటనా స్థలానికి చేరుకొని భారీ వృక్షాన్ని తొలగించి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్