ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామప్ప దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్ శుక్రవారం సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రామలింగేశ్వర స్వామికి పూజలు నిర్వహించి ఆశీర్వచనం చేశారు. అనంతరం ప్రసాద్ స్కీం పనులను పరిశీలించారు. వారి వెంట ఎండీ న్యాలకొండ ప్రసాద్ రెడ్డి, డిటిఓ శివాజీ, టూరిజం అధికారులు సరిత, నాథన్, ఏఈ విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.