ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బతుకమ్మ పండగ

1182చూసినవారు
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బతుకమ్మ పండగ
వరంగల్ జిల్లా రంగశాయిపేట జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన బుధవారం విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ మాట్లాడుతూ "ఆడపిల్లను పుట్టనిద్దాం బతకనిద్దాం.. చదవనిద్దాం ఎదగనిద్దాం" అనే నినాదంతో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా మహిళల ఉద్యమించాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్