నల్లబెల్లి మండలంలోని ప్రభుత్వ నిబంధనలు పాటించని బెల్ట్ షాప్ పై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ధర్నాచేపట్టారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు పరికి కోర్నేల్ బట్టు సాంబయ్య పులి రమేష్ బోట్ల నరేష్ మాట్లాడుతూ నల్లబేల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆనుకొని, రంగాపురంలోని ప్రభుత్వ పాఠశాల ఆనుకుని ఉన్న బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎస్సై , ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఫలితం శూన్యమని అన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూల్, గుడికి 500 మీటర్ల కనీసం దూరం ఉండాల్సి ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ నిబంధన ప్రకారం స్కూల్ ఆనుకొని బెల్టు షాపులను తొలగించి, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షాన దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బొమ్మ కంటి అనిల్ రమేష్ సమ్మయ్య శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు