హెర్బల్ మందు వికటించి ఎంజీ ఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు ఎం. యాదలక్ష్మి (40) శుక్రవారం మృతి చెందింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జోజెరువు గ్రామానికి చెందిన యాదలక్ష్మికొన్నేళ్లుగా మూర్చ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆలోపతి వైద్యం తీసుకుంటోంది. కాగా, ఈనెల 16న కవిత అనే మహిళ 15 రోజులు హెర్బల్ మందు వాడితే మూర్చ వ్యాధి నయమవుతుందని నమ్మించి, రూ. 3వేల ఎలాంటి పేరు లేని హెర్బల్ మందును యాదలక్ష్మికి ఇచ్చింది. ఈ మందులు వాడటంతో మూడు రోజుల్లో తీవ్ర అస్వస్థకు గురై ఈ నెల 19న అపస్మారక స్థితికి చేరుకుని శుక్రవారం మృతి చెందింది.