జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామంలో దశాబ్దాల క్రితం నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. బుధవారం కూలెందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనంలోనే పల్లె వైద్యశాల కూడా నిర్వహిస్తున్నారు. సిబ్బంది నిత్యం బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. గర్భిణీలు, చిన్నారులకు టీకాలు ఇచ్చే సమయంలో పై పెచ్చులు ఊడి పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని సిబ్బంది వాపోతున్నారు.