నర్సంపేట లో భారీ వర్షం

69చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆదివారం వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వర్షం పడింది. ఆదివారం అంగడి (సంత) కావడంతో చిరు వ్యాపారులు, కొనుగోలుదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని రోజులుగా ఉక్కపోతలతో సతమతం అవుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. ఇదిలా ఉండగా పంటలకు నష్టం పొంచి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్