కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

64చూసినవారు
కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) నర్సంపేట నియోజకవర్గంలోని జాతీయ సేవ పథకం యూనిట్ల ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ అధ్యక్షతన శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాలలోని సిబ్బంది అందరు యోగా ఆసనాలు వేసారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ యోగా యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. యావత్ ప్రపంచానికి వారసత్వం రూపంలో భారతదేశం యోగా అందించిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్