హనుమకొండలో జరిగే సీఎం ఇందిరా మహిళా శక్తి సభకు బస్సులన్నీ తరలించడంతో మంగళవారం వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్ లో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డిపో లోని దాదాపు బస్సులన్నీ సీఎం సభకు వెళ్లేందుకు గ్రామాలకు పంపించడంతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.